Border–Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ సిరీస్.. పిచ్‌లకు ఐసీసీ రేటింగ్

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవలే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 5 టెస్ట్ మ్యాచ్ లు ఐదు వేదికల్లో జరిగాయి. ఐదు వేదికల పిచ్ లు ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. తొలి నాలుగు టెస్టులు జరిగిన పిచ్ లకు వెరీ గుడ్ అని రేటింగ్ ఇచ్చింది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు పిచ్ కు మాత్రం సంతృప్తి కరం అని రేటింగ్ ఇచ్చింది. అన్ని టెస్టులు జరిగిన పిచ్ లకు ఐసీసీ మంచి రేటింగ్ ఇవ్వడం విశేషం. పెర్త్ లో తొలి టెస్ట్.. అడిలైడ్ లో రెండో.. బ్రిస్బేన్ లో మూడో టెస్ట్.. మెల్ బోర్న్ లో నాలుగో టెస్ట్.. సిడ్నీలో ఐదో టెస్ట్ జరిగాయి. 

5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. తొలి టెస్ట్ భారత్ గెలవగా.. ఆ తర్వాత నాలుగు టెస్టుల్లో ఆస్ట్రేలియా మూడు టెస్టుల్లో జయభేరి మోగించింది. బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్ట్ డ్రా గా ముగిసింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు ఆసీస్ అధికారికంగా అర్హత సాధించింది. సౌతాఫ్రికాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. మరోవైపు ఈ ఓటమితో భారత్ అధికారికంగా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి నిష్క్రమించింది.

ALSO READ | ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. 12 ఏళ్ళ తర్వాత టాప్-25 నుంచి కోహ్లీ ఔట్

పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం విశేషం. చివరిసారిగా 2014-15 లో ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది. ఈ సిరీస్ కు ముందు భారత్ వరుసగా నాలుగు సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది. సిరీస్ మొత్తం బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. 2026 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా భారత్ కు రానుంది.