బస్సు లేటు వచ్చిందని ఆర్టీసీ డ్రైవర్ ను కొట్టిన ప్రయాణికుడు..

వికారాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిచిపోయయి. డ్రైవర్ పై ప్రయాణికుడు దాడికి దిగినందుకు గాను నిరసనగా డ్రైవర్లు బస్సులు నిలిపివేశారు. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ డిపోలో బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న రాములు అనే వ్యక్తిపై నవాజ్ అనే ప్రయాణికుడు దాడి చేశాడు.  బస్సు అలస్యంగా వచ్చిందంని నవాజ్ డ్రైవర్, కండక్టర్ ను ప్రశ్నించగా..  భోజనం చేస్తున్నాం.. ఐదు నిమిషాల్లో బయలు దేరుతామని డ్రైవర్, కండక్టర్ చెప్పారు.

 ఈ క్రమంలోనే ఆగ్రహం తెచ్చుకున్న నవాజ్ డ్రైవర్ రాములు పైకి దాడికి దిగాడు. ఘటనపై తోటి వారు కలగజేసుకుని సర్దిచెప్పారు. ఆర్టీసీ అధికారులు ఘటనపై వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నవాజ్ పై చర్యలు తీసుకోవాలని బస్సులు నిలిపి ఆందోళనకు దిగారు డ్రైవర్లు . పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం కేసు నమోదయ్యిందని ఆర్టీసీ అధికారులు
తెలిపారు.