సిఫార్సు చేస్తూ కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు ఒక్కటే ఎంట్రెన్స్ టెస్ట్ ఉండాలని సిఫార్సు చేస్తూ కేంద్రం కమిటీని నియమించింది. క్లాస్ 12లో వచ్చిన మార్కుల ఆధారంగా కాలేజీల్లో అడ్మిషన్లు ఇస్తుండడంతో స్టూడెంట్లకు అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడింది. 2021–22 ఎడ్యుకేషనల్ ఇయర్ నుంచి సెంట్రల్ వర్సిటీల్లో అడ్మిషన్లకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ‘హై క్వాలిటీ యాప్టిట్యూడ్ టెస్ట్’ తప్పనిసరిగా రాయాలని, ఇందులో జనరల్, స్పెసిఫిక్ సబ్జెక్ట్ టెస్టు కూడా ఉంటాయని హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అమిత్ ఖరె చెప్పారు. యూనివర్సిటీల్లో చేరడానికి ఆసక్తి ఉన్న స్టూడెంట్స్‌కు అడ్మిషన్లు ఇవ్వడానికి చాన్స్ ఉంటుందని, రెండు, మూడు ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిన అవసరం ఉండదని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫీసర్లు అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ పంజాబ్, బతిండా వైస్ చాన్స్‌లర్ ఆర్.పి.తివారీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల కమిటీలో ఢిల్లీ యూనివర్సిటీ, సౌత్ బీహార్ సెంట్రల్ యూనివర్సిటీ, మిజోరం సెంట్రల్ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్లు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సెంట్రల్ యూనివర్సిటీల జాయింట్ సెక్రటరీ ఉన్నారు
