ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఓయోకు బిజినెస్ పరంగా ఇండియా కీలకమని ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తెలిపింది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ మూడవ వార్షిక ట్రావెల్ ఇండెక్స్– ఓయో ట్రావెలోపిడియా 2020ను ఇవాళ రిలీజ్ చేసింది. తెలిపింది. ఓయోకు అత్యధికంగా బుకింగ్స్ జరిగిన దేశంగా ఇండియా నిలిచింది. 2020లో అత్యధికంగా బుకింగ్స్ జరిగిన నగరాలలో ఢిల్లీ నిలిస్తే, వ్యాపార పర్యాటకుల కోసం హైదరాబాద్ నిలిచింది. అదే విధంగా భారత్ లో అత్యధికంగా సందర్శించిన మూడు రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణా నిలిచింది.
2020లో ఒకే అతిథి 128 సార్లు తమ ఆతిథ్యం పొందారని ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వెల్లడించింది. ఒకే కస్టమర్ ఒక సంవత్సరంలో 128 సార్లు ఆతిథ్యం పొందడం ద్వారా ఓయో బ్రాండ్ కు మార్కెట్ లో ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చని ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ సీఈవో రోహిత్ కపూర్ అన్నారు. ‘చాలా మంది కొన్ని వందల సార్లు ‘జాగ్రత్తగా వెళ్లిరండి’ అంటానే కానీ వాటికి అసలైన విలువను ఇప్పుడు తెలుసుకున్నామన్నారు.
