న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) సంఖ్య కిందటి నెలలో ఐదు కోట్ల మార్క్‌ను దాటిందని ఆమ్ఫీ ప్రకటించింది. మార్కెట్లో వోలటాలిటీ ఉండడంతో ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గినా , కీలక మైలు రాయిని అందుకున్నామని పేర్కొంది. కిందటి నెలలో 14 లక్షల కొత్త సిప్‌లు యాడ్ అయ్యాయని ఆమ్ఫీ ప్రకటించింది. కాగా, గత ఐదు నెలల్లో సగటున నెలకు 24 లక్షల సిప్‌లు యాడ్ అయ్యాయి. లాంగ్ టెర్మ్ ట్రెండ్ చూస్తుంటే ప్రస్తుతం ఇన్వెస్టర్లు సిప్ల ఇంపార్టెన్స్‌ను గుర్తించినట్టు తెలుస్తోందని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
