ఈవీ స్టేషన్ల జోరు

ఈవీ స్టేషన్ల జోరు

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వెహికల్స్​ (ఈవీల) కు డిమాండ్​ ఊపందుకోవడంతో వీటి చార్జింగ్​ స్టేషన్ల సంఖ్య దేశమంతటా పెరుగుతోంది.  కేవలం గత నెల నాలుగు నెలల్లోనే  మెగా సిటీల్లో వీటి సంఖ్య రెండున్నర రెట్లు పెరగడమే ఇందుకు ఉదాహరణ.   సూరత్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌‌‌‌‌‌‌‌‌‌కతా, ముంబై, చెన్నైలలో చార్జింగ్​ స్టేషన్లు విపరీతంగా పెరిగాయని సెంట్రల్​ పవర్​ మినిస్ట్రీ తెలిపింది. ఈ 9 నగరాల్లో అక్టోబర్ 2021, జనవరి 2022 మధ్య అదనంగా 678 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. మనదేశంలోని 1,640 పబ్లిక్ ఈవీ ఛార్జర్‌‌‌‌లలో దాదాపు 940 ఈ నగరాల్లోనే ఉన్నాయని మినిస్ట్రీ విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. చార్జింగ్​ స్టేషన్ల ఏర్పాటు కోసం మినిస్ట్రీ గత నెల 14న గైడ్​లైన్స్​ను, స్టాండర్డ్స్​ను కూడా ప్రకటించింది. ప్రైవేటు కంపెనీలతోపాటు బీఈఈ, ఈఈఎస్​ఎల్, పీజీసీఐఎల్​, ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలూ ఈ వ్యాపారంలోకి వచ్చేలా ఎన్డీయే ప్రభుత్వం చొరవ తీసుకుంది. మెట్రో సిటీల్లో ఈవీ చార్జింగ్​ నెట్​వర్క్​ బలంగా ఉన్నందున, ఇక మీదట మిగతా సిటీలపై ఫోకస్​ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది. సిటీలతోపాటు నేషనల్​ హైవేల వెంట 22 వేల చార్జింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఆయిల్ మార్కెటింగ్​ కంపెనీలు  ప్రకటించాయి. వీటిలో10 వేల స్టేషన్లను ఐఓసీ   ద్వారా, 7,000 స్టేషన్లు  బీపీసీఎల్​ ద్వారా,  మిగిలిన 5,000 స్టేషన్లు​  హెచ్​పీసీఎల్​ ద్వారా ఇన్​స్టాల్​చేస్తారు.  ఐఓసీఎల్​ ఇప్పటికే 439 ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌‌‌‌లను ఇన్‌‌‌‌స్టాల్ చేసింది.   బీపీసీఎల్​ 52 ఛార్జింగ్ స్టేషన్లను, హెచ్​పీసీఎల్​ 382 ఛార్జింగ్ స్టేషన్లను అమర్చింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఇటీవల 25 హైవేలు & ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేలపై ఏర్పాటు చేయడానికి1,576 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌‌‌‌లను మంజూరు చేసింది.  
 

బ్యాటరీ శ్వాపింగ్​తో ఎన్నో సవాళ్లు
ఈవీ బ్యాటరీలను మార్చుకునే (శ్వాపింగ్​) విధానాన్ని ఖరారు చేయడానికి నీతి ఆయోగ్​ శుక్రవారం మీటింగ్​ పెట్టనుంది. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్​ (బాస్​)గా తీసుకురావాలని భావిస్తోంది. అయితే ఈ విధానంతో చాలా సమస్యలు వస్తాయని అంటున్నారు. కంపెనీలు రెండు రకాల ఈవీలను అమ్ముతున్నాయి. ఫిక్స్​డ్​ బ్యాటరీ విధానంలో లేదా రిమూవబుల్ బ్యాటరీ పద్ధతిలో ఈవీని కొనొచ్చు. రిమోవల్​ పద్ధతిలో అయితే బ్యాటరీని లీజుకు ఇస్తారు.  ఇలాంటి వాళ్లు తమ బ్యాటరీ డిశ్చార్జ్​ అయితే దగ్గర్లోనే స్వాపింగ్​ స్టేషన్​కు వెళ్లి ఫుల్లీ చార్జ్​డ్​ బ్యాటరీని తీసుకోవచ్చు. బ్యాటరీ శ్వాపింగ్​పై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఫిక్స్​డ్​ బ్యాటరీతో కూడిన ఈవీని కొంటే ఐదుశాతమే జీఎస్టీ ఉంటుంది. బాస్​ పద్ధతిలో కొంటే ప్రభుత్వ రాయితీలు కూడా రావు. మనదేశంలో ఇప్పటికీ తగినన్ని శ్వాపింగ్​ స్టేషన్లు లేవు. ఈవీ కంపెనీలు ప్రొప్రైటరీ బ్యాటరీ, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. అన్ని వెహికల్స్​కూ ఒకే రకం బ్యాటరీ వాడకం సరికాదని అంటున్నాయి.