వచ్చే ఐదేళ్లలో మరిన్ని ఎయిర్​పోర్టుల నిర్మాణం

వచ్చే ఐదేళ్లలో మరిన్ని ఎయిర్​పోర్టుల నిర్మాణం
  •     2014లో వీటి సంఖ్య 74 మాత్రమే
  •     ఇయ్యాల గోవా ఎయిర్​పోర్టును ప్రారంభించనున్న మోడీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎయిర్​పోర్టుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వీటి నిర్మాణానికి మోడీ ప్రభుత్వం చాలా ఇంపార్టెన్స్​ ఇస్తోందని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. గోవాలోని మోపా ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టును ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 2014 లో ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలోని ఎయిర్​పోర్టుల సంఖ్య 74 నుంచి 140కి పెరిగిందని వర్గాలు తెలిపాయి. వచ్చే ఐదేళ్లలో 220 ఎయిర్​పోర్టులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించాయి.  అన్ని నగరాల మధ్య కనెక్టివిటీని పెంచడానికి మోడీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని సంబంధిత ఆఫీసర్​ ఒకరు అన్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఎయిర్​పోర్టులను ప్రారంభించారని అన్నారు. త్వరలో మరిన్ని ఎయిర్​పోర్టులకు శంకుస్థాపనలు చేయబోతున్నారని  తెలిపారు.

ఈ నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌లో అరుణాచల్ ప్రదేశ్‌‌‌‌లోని ఇటానగర్‌‌‌‌లో గ్రీన్‌‌‌‌ఫీల్డ్ డోనీ పోలో ఎయిర్​పోర్టును, జులైలో దేవ్​గఢ్​ ఎయిర్​పోర్టును ప్రారంభించారు. కిందటేడాది నవంబర్‌‌‌‌లో ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని జేవార్‌‌‌‌లో నోయిడా ఇంటర్నేషనల్​ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. కిందటేడాది అక్టోబర్‌‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన ఖుషినగర్ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టును ప్రారంభించారు.  మోపా ఇంటర్నేషనల్​ విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా  2016 నవంబర్​లో  ప్రధానమంత్రి మోడీయే చేశారు. ఇది గోవాలో రెండవ ఎయిర్​పోర్టు. మొదటిది డబోలిమ్‌‌‌‌లో ఉంది. మోపా ఎయిర్​పోర్టుతో పోలిస్తే డబోలిమ్‌‌‌‌ ఎయిర్​పోర్టులో అత్యాధునిక సౌకర్యాలు, టెక్నాలజీ ఉందని అధికారులు తెలిపారు. డబోలిమ్ ఎయిర్​పోర్టుకు  ప్రస్తుతం 85 లక్షల మంది ప్రయాణీకులకు సేవలు అందించే సామర్థ్యం ఉంది.