ఐఐటీల్లో పీజీ కోర్సులకు జామ్

దేశంలోని 21 ఐఐటీల్లో 2025–-26 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ(టెక్నాలజీ), ఎంఎస్‌‌(రీసెర్చ్‌‌), ఎమ్మెస్సీ-పీహెచ్‌‌డీ (డ్యూయల్‌‌ డిగ్రీ) కోర్సుల్లో 3,000 సీట్ల భర్తీకి నిర్వహించే ‘జాయింట్‌‌ అడ్మిషన్‌‌ టెస్ట్‌‌ ఫర్‌‌ మాస్టర్స్‌‌ (జామ్‌‌-2025)’కు  నోటిఫికేషన్ రిలీజ్​ అయింది. 

జామ్‌‌ స్కోరుతో ఐఐటీలతోపాటు, ఐఐఎస్సీ, ఐఐఎస్‌‌ఈఆర్‌‌లు, ఎన్‌‌ఐటీలు, ఇతర విద్యా సంస్థల్లో అడ్మిషన్స్​ లభిస్తాయి. ఇంటిగ్రేటెడ్‌‌ పీహెచ్‌‌డీల్లో అవకాశం వచ్చినవారు స్టైఫెండ్​ అందుకోవచ్చు.
అర్హత: నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఎగ్జామ్​ ప్యాటర్న్​: జామ్‌‌ ప్రవేశ పరీక్షను ఆన్‌‌లైన్‌‌లో నిర్వహిస్తారు. వ్యవధి 3 గంటలు. ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఏ సబ్జెక్టు ప్రశ్నపత్రంలోనైనా మొత్తం ఆబ్జెక్టివ్‌‌ 60 ప్రశ్నలు. వంద మార్కులు. మూడు విభాగాల్లో (మల్టిపుల్‌‌ ఛాయిస్, మల్టిపుల్‌‌ సెలెక్ట్, న్యూమరికల్‌‌) ప్రశ్నలు అడుగుతారు. వీటిని ఎ, బి, సి సెక్షన్లుగా విభజించారు.
అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 3 నుంచి అక్టోబర్​ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న నిర్వహించనున్నారు. వివరాలకు www.jam2025.iitd.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.