వ్యాక్లిన్ల మిక్సింగ్‌ ప్రోటోకాల్‌కి అనుమతి లేదు

వ్యాక్లిన్ల మిక్సింగ్‌ ప్రోటోకాల్‌కి అనుమతి లేదు

న్యూఢిల్లీ: వ్యాక్లిన్ల మిక్సింగ్‌ ప్రోటోకాల్‌కి అనుమతి లేదని తెలిపారు నీతీ అయోగ్‌ సభ్యుడు, వ్యాక్సినేషన్‌ నిపుణుల కమిటీ చైర్మన్‌ వీకే పాల్. మంగ‌ళ‌వారం ఆయ‌న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల కొరత సమస్య వచ్చినప్పటి నుంచి టీకా మిక్సింగ్‌ అంశం తెరపైకి వచ్చిందన్నారు. ప్రస్తుతం మనదేశంలో కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌ టీకాలు ప్రజలకు అందించామ‌ని.. దేశంలో చాలా మంది ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని కోవిడ్‌ తొలి డోస్‌ టీకాగా తీసుకున్నారన్నారు.

రెండో డోసు టీకా కోసం ఎదురు చూస్తున్నారని.. అయితే తొలి డోసు తీసుకున్న టీకా లభ్యత లేకపోవడంతో.. మరో కంపెనీ టీకాను రెండో డోసుగా తీసుకొవచ్చా.. వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ క్షేమమేనా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి టీకా మిక్సింగ్ ని వ్యాక్సినేషన్‌ ప్రోటోకాల్‌లో చేర్చలేదని.. వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నట్టు పరిశోధనల్లో తేలినా.. అదే స్థాయిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నట్టు గుర్తించాలన్నారు. వ్యాక్సిన్‌ మిక్సింగ్ పై అంతర్జాతీయంగా పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని వీకే పాల్. చెప్పారు.