ముంబై: స్టాక్ మార్కెట్లో తీవ్ర నష్టాల కారణంగా మనదేశంలో టాప్–-10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పోయినవారం దారుణంగా పడిపోయింది. ‘టాప్-10 మోస్ట్ వాల్యబుల్కంపెనీ’ల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) రూ. 2.29 లక్షల కోట్లకు పైగా పడిపోయింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.44,311.19 కోట్లు తగ్గి రూ.18,36,039.28 కోట్లకు చేరుకుంది. టీసీఎస్, ఇన్ఫోసిస్ లు రూ.45,746.13 కోట్ల మార్కెట్ క్యాప్ నష్టపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.34,970.26 కోట్ల మేర పడిపోయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాల్యుయేషన్ రూ.16,433.92 కోట్లు తగ్గింది. స్టేట్ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.2,231.15 కోట్లు పడిపోయి రూ.4,12,138.56 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.16,305.19 కోట్లు పడిపోయి రూ.5,00,744.27 కోట్ల దగ్గర ఆగింది. హెచ్‌యుఎల్ విలువ రూ.21,674.98 కోట్లు తగ్గి రూ.5,16,886.58 కోట్లకు చేరుకోగా, ఎల్‌ఐసి మార్కెట్క్యాప్ రూ.57,272.85 కోట్లు తగ్గి రూ.4,48,885.09 కోట్లకు చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి వాల్యుయేషన్ రూ.17,879.22 కోట్లు తగ్గి రూ.3,95,420.14 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్ ఎంక్యాప్ కూడా తగ్గింది.
