అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఫ్రీ సర్వీస్!

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఫ్రీ సర్వీస్!

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ ప్రైమ్ మెంబర్స్ కోసం ఉచితంగా మరొక సర్వీస్ ని తీసుకొచ్చింది. ఇతర దేశాల్లో ఇప్పటికే ప్రైమ్ గేమింగ్ సర్వీస్ అందుబాటులో ఉంది. అయితే, భారత్ లో ఈ సర్వీస్ ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీస్ ద్వారా మొబైల్, పీసీల్లో ఉచితంగా ఆన్ లైన్ గేమ్స్ ఆడొచ్చు. విండోస్ పీసీలు వాడుతున్న వాళ్లు ఫ్రీగా డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. 

ఈ సర్వీస్ ద్వారా అమెజాన్ ప్రైమ్ మెంబర్లు కాల్‌ ఆఫ్‌ డ్యూటీ, వార్‌ జోన్‌ 2.0, ఫిఫా 23, లీగ్‌ ఆఫ్‌ లెజెండ్స్‌, డెస్టినీ2 లాంటి గేమ్స్‌ ఆడటానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ గేమ్స్ ఆడాలంటే అమెజాన్ గేమింగ్ వెబ్ సైట్లోకి వెళ్లి, అమెజాన్ ప్రైమ్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి. కాకపోతే కొన్ని రకాల గేమ్స్ ఆడాలంటే విండోస్ పీసీల్లో అమెజాన్ గేమ్స్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఆడాలి. అమెజాన్ గేమ్స్ ఆడాలంటే ఇదివరకు సంవత్సరానికి రూ.1499ల ప్యాక్ ని పొందాల్సి ఉంటుంది.