హైదరాబాద్, వెలుగు: టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు కేరళ టూరిజం డిపార్ట్‌మెంట్ సరికొత్త ఇనిషియేటివ్‌లను తీసుకొచ్చింది. కేరళకు ప్రతీ నిమిషానికి 35 మంది డొమెస్టిక్ టూరిస్ట్‌లు, ఇద్దరు ఇంటర్నేషనల్ టూరిస్ట్‌లు వస్తున్నారని కేరళ టూరిజం డైరెక్టర్ వీఆర్ కృష్ణ తేజ అన్నారు. ఇంటర్నేషనల్ టూరిస్ట్‌లు కేరళ వస్తే కనీసం 14–30 రోజులు ఉంటున్నారని, లోకల్ టూరిస్ట్‌లు మాత్రం సగటున 4 రోజులే ఉంటున్నారని చెప్పారు. డొమెస్టిక్ టూరిస్ట్‌లు సగటున తొమ్మిది రోజుల పాటు కేరళలలో స్టే చేసేలా అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నామని అన్నారు. కార్వెన్, ప్లాంటేషన్ రిసోర్ట్, బీచ్ రిసోర్ట్, జంగిల్ రిసోర్ట్, బోట్ హౌస్ వంటివి కేరళ టూరిజం డిపార్ట్‌మెంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఏడాది మేలో కేరళ ట్రావెల్ మార్ట్ , అగస్ట్– నవంబర్‌లో ఛాంపియన్స్ బోట్ లీగ్ జరుగుతుంది.
