స్టేజీపైకి కాంగ్రెస్​ఇంచార్జిని పిలువడంపై రచ్చ

  •   ప్రోటోకాల్​పాటించాలని డిమాండ్​చేసిన ఎమ్మెల్యే, ఎంపీ 
  •    పోటీపోటీగా నినాదాలు 
  •    రసాభాస మధ్య మంత్రి కొండా సురేఖ చెక్కుల పంపిణీ  

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, భాజపా ఎంపీ రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రితో పాటు శ్రీనివాస్‌రెడ్డి వేదికపైకి వెళ్లారు. ఆయన వేదికపై ఉండొద్దని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రొటోకాల్‌ పాటించాలని పట్టుబట్టారు. దీంతో కాంగ్రెస్‌, భారాస కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. కార్యకర్తలను పోలీసులు నిలువరించడంతో శ్రీనివాస్‌రెడ్డి వేదిక నుంచి కింది దిగారు. రసాభాస మధ్యే మంత్రి కొండా సురేఖ చెక్కులను పంపిణీ చేశారు.

ALSO READ | చాకలి ఐలమ్మ త్యాగానికి గుర్తుగా..మహిళా యూనివర్సిటీకి ఆమె పేరుపెట్టాం: మంత్రి పొన్నం