కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కేసులో విచారణ కొనసాగుతోంది. చనిపోయిన రోజు కోడెల చివరి ఫోన్ కాల్ తన గన్‌మెన్ ఆదాబ్‌కు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో18 మందిని సాక్షులను విచారించారు. విచారణ నిమిత్తం వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకావాలని కోడెల కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మీలను పోలీసులు ఆదేశించారు. అయితే 11 రోజుల తరువాత వస్తామని వారిద్దరూ పోలీసులకు తెలిపినట్టు సమాచారం. మరోవైపు కోడెల ఆత్మహత్య కేసును సీబీఐకు అప్పగించాలని అనిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

