న్యూఢిల్లీ: భారత్ బయోటిక్ కంపెనీ వ్యాక్సినేషన్లో మరో ముందడుగు వేసింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్తీసుకున్నవారికి బూస్టర్‌డోస్‌గా ఇంట్రానాసల్(ముక్కు ద్వారా వేసే చుక్కల మందు) టీకా వేసేందుకు ఫేజ్3 క్లినికల్ ట్రయల్స్నిర్వహణకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ఫేజ్2 క్లినికల్ట్రయల్స్కు ఆగస్టులోనే అప్రూవల్వచ్చింది. ఫేజ్3 పరీక్షలకు భారత్ బయోటెక్ డిసెంబర్లో అనుమతి కోరగా.. డీసీజీఐ జనవరి 27న పర్మిషన్ఇచ్చింది. ఫేజ్ 3 ట్రయల్స్‌లో భాగంగా ఇంట్రానాసల్ ఇమ్యునోజెనిసిటీ, రక్షణను కొవాగ్జిన్‌తో కూడా పోల్చి స్టడీ చేయనున్నారు. ముక్కు ద్వారా వేసే చుక్కల మందు టీకా అందుబాటులోకి వస్తే సూదులు, సిరంజిల వాడకం తగ్గి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొత్తం ఖర్చుపై ప్రభావం ఉంటుందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా తెలిపారు.
