రోజావే.. చిన్ని రోజావే..

ప్రపంచంలో ఎన్ని పూలున్నా గులాబీ పూలకు ( Rose Flowers) ప్రత్యేక స్థానం ఉంది.  చాలామంది దీనిని ప్రేమకు చిహ్నంగా ఇస్తుంటారు.  ఇక ప్రేమికుల రోజు వచ్చిందంటే గులాబీ పూలకు ఉండే డిమాండ్​ అంతా ఇంతా కాదు.  మంచి సువాసన కలిగి.. వివిధ రంగుల్లో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.  ఇంత అందంగా కనిపించే గులబీ పూలకు ఒక రోజు ఉందంటున్నారు. రోజెస్​ డే  ఎప్పుడు.. . వాలంటైన్​ డే రోజు గులాబీ పూలను ఎందుకు ఇస్తారో .. ఇప్పుడు తెలుసుకుందాం. . .

ఫిబ్రవరి 14 వాలంటైన్​  డే.. ఈ రోజు ప్రేమికులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. గులాబీ పూలతో ( Rose Flower)  కనిపిస్తుంటారు.  వాలంటైన్  వీక్​ ఫిబ్రవరి 7 రోజ్‌డేతో మొదలువుతుంది.  అందుకే ఫిబ్రవరి 7వ తేదీని రోజెస్​ డేగా పరిగణిస్తారు

ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ప్రేమ పండుగకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అయితే వాలెంటైన్స్ డే సందడి వారం రోజుల ముందుగానే ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలెంటైన్ వీక్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వీక్‌ను రొమాంటిక్ వీక్‌గా చెప్పుకుంటారు. వాలెంటైన్ వీక్‌ ఫిబ్రవరి 7 రోజ్‌డేతో మొదలువుతుంది. ఈ రోజు(ఫిబ్రవరి 7) నుంచి 14 వరకు ప్రతి రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

గులాబీలలో ఎర్ర గులాబీ అత్యంత ప్రియమైనది. ఎరుపు రంగు ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది.  రోమన్ పురాణాలలో, గులాబీని అభిరుచికి చిహ్నంగా పిలుస్తారు.  ఆ పురాణాల ప్రకారం ఎర్ర గులాబీని ప్రేమకు చిహ్నంగా పిలుస్తారు. ఎర్ర గులాబీ కథ ప్రేమ దేవతగా పరిగణించబడే గ్రీకు దేవత ఆఫ్రొడైట్‌కి సంబంధించినది. ఒకసారి ఆఫ్రొడైట్ ప్రేమికుడు అడోనిస్ గాయపడినప్పుడు.. ఆమె తెల్లటి గులాబీ ముళ్లపై నుంచి అతని వద్దకు పరిగెత్తింది. అప్పుడు ఆమె పాదాలు గులాబీ ముళ్లు గుచ్చుకొని ఎర్రగా మారాయి. ఈ కారణంగా ఎర్రటి గులాబీ అంతులేని ప్రేమకు చిహ్నంగా మారింది. మీరు ఈ ప్రేమికుల వారంలో ఎర్ర గులాబీని ఎవరికైనా ఇస్తున్నారంటే వారిని ప్రేమిస్తున్నారని చెప్పడమే.

పింక్ గులాబీ :  పింక్ రంగు గులాబీ అనేది అభిమానికి గుర్తింపుగా చెప్పాలి. ఎవరినైనా అభినందించాలన్న లేదా మెచ్చుకోవాలన్న పింగ్ గులాబీ ఇవ్వండి.
ఈ రంగు ఒకరికొకరు నమ్మకం ..  ఆకర్షణను కూడా సూచిస్తుంది. .   

పసుపు గులాబీ: పసుపు రంగు గులాబీ అనేది ఇద్దరి మధ్య స్నేహాన్ని సూచిస్తుంది . ఏదైనా సంబంధం స్నేహంతో మొదలవుతుంది. మీరు ఎవరితోనైనా స్నేహం చేసి, వారికి మీరు మంచి స్నేహితునిగా భావించాలనుకుంటే, వారికి పసుపు గులాబీలను బహుమతిగా ఇవ్వండి. వారిపై మీకు ఇష్టం, అభిమానం, ఆ స్నేహం మీతో ఇలానే కలకాలం నిలిచి ఉండాలంటే పసుపు రంగు గులాబీ ఇవ్వడం సరైనది.. 

ఆరెంజ్ గులాబీ: మీరు ఎవరినైనా చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటే.. వారికి ఆరెంజ్ గులాబీని ఇవ్వండి. మీ ఇష్టాన్ని తెలిపేందుకు ఆరెంజ్ గులాబీ ఇవ్వడం మంచి మార్గం. అంతే కాకుండా మీ మనసులో మాటను బయటపెట్టండి. ఇద్దరి ఇష్టాలు ఒకరికొకరు పంచుకోండి.

పీచు గులాబీ: మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే మీ మనసులో మాట చెప్పటానికి భయం లేదా సిగ్గుపడుతుంటే వారికి పీచు గులాబీ ఇవ్వండి. ఈ గులాబీ ద్వారా మీ మనసులో మాటను సులభంగా చెప్పవచ్చు. ఈ పీచు గులాబీ ఇస్తే.. ప్రేమిస్తున్నారని అర్థం.

లావెండర్ గులాబీ: లావెండర్ గులాబీ అనేది చాలా అరుదైనది. ఈ రంగు గులాబీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మీరు ఎవరితో అయినా మొదటి చూపులో ప్రేమలో పడితే లావెండర్ గులాబీని బహుమతిగా ఇవ్వండి. అంతేకాకుంగా వారి ఆకర్షించే రూపాన్ని, అందాన్ని పొగడటానికి ఈ గులాబీ ఇస్తే సరిపోతుంది.

ALSO READ :- అయోధ్యలో KFCనా.. ఏంటి రామా..

తెల్ల గులాబీ: తెల్ల గులాబీని ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చుకుంటారు. శుభాకాంక్షలు చెప్పడానికి, ఎవరైన దూరం అయితే నివాళిగా తెల్ల గులాబీ ఇవ్వడం సరైనది.ప్రేమికులు ఈ తెల్ల గులాబీలు సాధారణంగా ఇచ్చిపుచ్చుకోరు