ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష ఖరారు చేసిన హైకోర్టు

ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష ఖరారు చేసిన హైకోర్టు
అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే కూర్చోవాలని.. అలాగే వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాలంటూ శిక్ష విధించింది. జరిమానా చెల్లించకపోతే వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించిన హైకోర్టు ఈ శిక్ష విధించింది.