ఢిల్లీలో దారుణం జరిగింది. న్యూఇయర్ పార్టీకి డబ్బులడిగితే ఇవ్వలేదని ఓ మనవడు తన నానమ్మను కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షాహ్‌దర ప్రాంతంలో వెలుగుచూసింది. సతీష్ జాలీ అనే 73 ఏళ్ల మహిళ రోహ్తష్ నగర్‌లో తమ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్నారు. అదే ఇంటి ఫస్ట్ ఫ్లోర్‌లో ఆమె కొడుకు సంజయ్.. తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కాగా.. ఆమె రెండో కుమారుడు మనోజ్ మాత్రం.. ఆ ఇంటికి దగ్గరలోని మరో ఇంట్లో నివసిస్తున్నాడు.
ఆదివారం ఉదయం సంజయ్ కిందికి వచ్చి అమ్మను పిలవగా.. ఆమె డోర్ తీయలేదు. దాంతో సంజయ్.. మనోజ్‌కు ఫోన్ చేసి తల్లి గురించి ఆరా తీశాడు. అయితే మనోజ్ కూడా తల్లి తన ఇంటికి రాలేదని చెప్పాడు. వెంటనే మనోజ్.. తన తల్లి ఉంటున్న సంజయ్ ఇంటి దగ్గరకు వచ్చాడు. ఎంత పిలిచినా తల్లి తలుపులు తీయకపోవడంతో ఇద్దరూ కలిసి తలుపులు పగులగొట్టారు. లోపలికి వెళ్లిన అన్నదమ్ములు షాక్‌కు గురయ్యారు. వారి తల్లి సతీష్ జాలీ కుర్చిలో శవమై కనిపించింది. పక్కనే నేలమీద రక్తపు మరకలు మరియు ఒక సుత్తి ఉన్నాయి. వెంటనే అన్నదమ్ములిద్దరూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా.. సంజయ్ కొడుకు కరణ్ శనివారం రాత్రి ఆమె ఇంట్లోంచి బయటకు రావడం చూశారు. దాంతో అతని అదుపులోకి తీసుకొని విచారించారు.
న్యూఇయర్ పార్టీకి డబ్బులివ్వకపోవడం వల్లే కోపంతో నానమ్మను చంపినట్లు కరణ్ ఒప్పుకున్నాడు. ఇంట్లో కిరాయికి ఉండే వాళ్ల దగ్గరి నుంచి పని ఉందని అని చెప్పి సుత్తి తీసుకొచ్చి.. నానమ్మ తలపై బలంగా కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. నానమ్మను చంపిన కరణ్.. ఇంట్లోని రూ. 18 వేల రూపాయలతో పారిపోయాడు. కరణ్‌కు తండ్రి సంజయ్ ఫోన్ చేసి ఇంటికి రమ్మనడంతో వచ్చిన కరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరణ్ యూపీలోని మీరట్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.
For More News..
భారత్‌లో ఆరు కొత్త స్ట్రెయిన్ కేసులు.. హైదరాబాద్‌లో రెండు..
మనసుకు నచ్చని వాడితో కాపురం చేయలేను.. 16 రోజులకే సూసైడ్ చేసుకున్న నవవధువు
5 వేలు పెడితే రోజూ 400 ఇస్తామని నమ్మించి..
