బ్యాటరీలు, ఇతర కాంపోనెంట్ల దిగుమతులపై సుంకాలు తగ్గించే అవకాశం

బ్యాటరీలు, ఇతర కాంపోనెంట్ల దిగుమతులపై సుంకాలు తగ్గించే అవకాశం

    కొన్నింటిపై మినహాయింపులు కూడా ఇవ్వాలని చూస్తున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: దేశ ఎలక్ట్రిక్ వెహికల్‌‌ (ఈవీ) సెక్టార్‌‌‌‌కు  రానున్న బడ్జెట్‌‌లో ప్రభుత్వం పెద్ద పీట వేయనుంది. లోకల్‌‌గా ఈవీలు, బ్యాటరీల తయారీని  పెంచేందుకు వివిధ రకాల ప్రోత్సాహకాలను ఇవ్వనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  ప్రస్తుతం మొబైల్ ఫోన్ బ్యాటరీల్లో వాడే లిథియం అయాన్ సెల్స్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు ఇస్తున్నారు. దీన్ని ఈవీ బ్యాటరీలకు, ఇతర రకాల ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ఈఎస్‌‌ఎస్‌‌) కు పొడిగించే అవకాశం ఉంది.  లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో వాడే ఇతర కాంపోనెంట్పై కూడా ఇంపోర్ట్ డ్యూటీని  ప్రభుత్వం తగ్గించనుందని  సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇది 5–20 శాతం రేంజ్‌‌లో ఉంది. ‘ఎలక్ట్రిక్ వెహికల్స్‌‌, కాంపోనెంట్ల తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం చూస్తోంది. వీటిపై కొన్ని రకాల దిగుమతి సుంకాలను తగ్గించే అవకాశం ఉంది’ అని అన్నారు. లోకల్‌‌గా లిథియం అయాన్ బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు  కాథోడ్‌‌, ఆనోడ్‌‌, సింథటిక్ సపరేటర్స్‌‌, ఇతర కాంపోనెంట్ల దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌‌– సెప్టెంబర్ మధ్య ఇండియా 1.32 బిలియన్ డాలర్ల విలువైన లిథియం అయాన్ సెల్స్‌‌ను దిగుమతి చేసుకుంది.  

ఆర్థిక సంవత్సరం 2021–22 లో ప్రభుత్వం చేసుకున్న లిథియం అయాన్ సెల్స్ దిగుమతుల్లో మెజార్టీ వాటా చైనా నుంచి వచ్చింది.  చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు రూ.25,938 కోట్లతో పీఎల్‌ఐ స్కీమ్‌‌ను  ఆటో సెక్టార్‌‌‌‌, రిలేటెడ్ సెక్టార్‌‌‌‌లో తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కిందకు  ఈవీలు  కూడా వస్తున్నాయి. దీనికి అదనంగా రూ.18,100 కోట్ల పీఎల్‌‌ఐ స్కీమ్‌‌ను అడ్వాన్స్డ్‌‌ కెమిస్ట్రీ సెల్స్‌‌ సెగ్మెంట్‌‌లో కూడా తీసుకొచ్చింది.