- రాష్ట్రవ్యాప్తంగా రోజుకు లక్ష మెట్రిక్ టన్నులు కొంటున్న సర్కారు
- స్పీడ్‌గా ఆన్‌లైన్‌ఎంట్రీలు
- ఇప్పటివరకు 34.20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ
- రూ.7,481 కోట్లకు రైతుల అకౌంట్లలో రూ.6,697 కోట్లు జమ
మహబూబ్‌నగర్, వెలుగు : రాష్ర్టవ్యాప్తంగా వడ్ల కొనుగోలు సెంటర్ల వద్ద సేకరణ స్పీడ్‌గా జరుగుతోంది. సేకరించిన వడ్ల వివరాలను ఎప్పటికప్పుడు సెంటర్ల నిర్వాహకులు, ఆఫీసర్లు ఆన్లైన్ఎంట్రీ చేస్తుండటంతో.. వాటిని కొన్న 24 గంటల్లోనే రైతుల అకౌంట్లల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. దీంతో రైతులు గత పంట కోసం చేసిన అప్పులను క్లియర్చేసుకోవడంతో పాటు యాసంగి సాగుకు కూడా రెడీ అవుతున్నారు. వరి తుకాలు పోసుకొని నాట్లు పెట్టుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. వానాకాలం సీజన్ లో రాష్ర్టవ్యాప్తంగా 66.7 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. దాదాపు 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా చేశారు. ఇప్పటికే చాలా చోట్ల వరి కోతలు మొదలు కాగా.. సీజన్చివరలో నాట్లు పెట్టుకున్న ప్రాంతాల్లో ఇంకా కోతలు ప్రారంభం కాలేదు. అయితే... రాష్ర్టవ్యాప్తంగా రైతుల నుంచి ప్రభుత్వం బుధవారం నాటికి 34.20 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.7,481 కోట్లు కాగా.. రైతులకు రూ.6,697 కోట్ల పేమెంట్లు చేసింది. 84 శాతం పూర్తి చేసింది. పేమెంట్లు త్వరగా అవుతుండడంతో సన్నాలు సాగు చేసిన రైతులు వడ్లను వ్యాపారులు, ప్రైవేట్వ్యక్తులకు కాకుండా ప్రభుత్వ సెంటర్ల వద్దే అమ్ముతున్నారు. ప్రతి రోజూ వడ్ల సెంటర్లకు లక్ష మెట్రిక్ టన్నులు వస్తున్నాయి.
గతంలో పేమెంట్లకు 45 రోజులు
గత పాలనలో సెంటర్లలో వడ్లు అమ్మిన రైతులకు ఆన్‌లైన్‌ఎంట్రీలు లేట్ కావడంతో పేమెంట్లు లేట్ అయ్యేవి. దీనికితోడు బ్యాంక్అకౌంట్లో ఆధార్, ఫోన్ నంబర్లు, ఇంటి పేర్లు తప్పులుగా ఉండటంతో ఓటీపీలు రావడానికి రైతులకు ఇబ్బందులు పడ్డారు. దీంతో పేమెంట్లు చేయడానికి 45 రోజుల టైం పట్టేది. ఆధార్, ఇతర వివరాలు సరిగా లేని రైతులు వారికి తెలిసిన రైతుల పేర్ల మీద వడ్లు అమ్మి.. ఆలస్యంగా డబ్బులు తీసుకునేటోళ్లు. ఇలాంటి ఇబ్బందులతో విసిగిపోయిన చాలా మంది మూడేండుగా ప్రభుత్వ సెంటర్లకు వడ్లను తీసుకురావడం తగ్గించారు. సన్నాలను ప్రైవేట్వ్యాపారులు, కర్నాటక, మహారాష్ర్టలో అమ్ముకున్నారు. దొడ్డు వడ్లు మాత్రమే ప్రభుత్వ సెంటర్లకు తీసుకెళ్లారు. ఈ వానాకాలం సీజన్మొదట్లో కూడా కర్నాటకకు సమీపంలోని జిల్లాల్లో రైతులు కొంత పంటను అక్కడ అమ్ముకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు తీసుకున్న మరుసటి రోజు పేమెంట్లు చేస్తుండటంతో సన్నాల రైతులు కూడా పెద్ద మొత్తంలో ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు పంటను తెస్తున్నారు.
టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ చేసి..
రాష్ర్ట ప్రభుత్వం వడ్ల రైతులకు ఇబ్బందులు లేకుండా ఇన్టైంకు పేమెంట్లు చేయడానికి ముందుగానే నిధులు సిద్ధం చేసింది. అయితే ఆన్లైన్ఎంట్రీలో టెక్నికల్ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసేందుకు కొనుగోళ్లకు ముందే సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్, సివిల్ సప్లయ్కమిషనర్డీఎస్ చౌహాన్ అగ్రికల్చర్, సివిల్ సప్లయ్ఆఫీసర్లు, బ్యాంకర్లతో పలుమార్లు సమీక్షలు చేశారు. వ్యవసాయ శాఖ సిబ్బంది ఫీల్డ్విజిట్చేసి రైతుల వివరాలను ఆన్లైన్ ఎంట్రీ చేశారు. ఆధార్, ఫోన్ నంబర్లు, పేర్లను సరిగా ఉండాలనే చూసి ఆ వివరాలను బ్యాంకులకు పంపించి టెక్నికల్ప్రాబ్లమ్స్ను క్లియర్ చేశారు. దీంతో ఇప్పుడు రైతుల నుంచి వడ్లు సేకరించిన వెంటనే సెంటర్ల నిర్వాహకులు ఓపీఎంఎస్కంప్లీట్ చేస్తున్నారు. ఆ వివరాలు నిమిషాల్లోనే మిల్లులకు వెళ్లిపోతుండటంతో వారు కూడా వెంటనే ఓపీఎంఎస్ కంప్లీట్చేస్తుండటంతో జిల్లా సివిల్సప్లయ్డీఎంల లాగిన్‌కు వివరాలు చేరిపోతున్నాయి. అక్కడ సిబ్బంది రైతుల వివరాలను చెక్‌చేసి వడ్ల పేమెంట్లు చేస్తున్నారు.
మూడు రోజులకే పైసలు
గతేడాది వానాకాలం సీజన్లో సెంటర్లో 80 క్వింటాళ్ల వడ్లు అమ్మిన. వారంలో పైసలు ఇస్తమని.. మూడు వారాల తర్వాత పేమెంట్ చేసిండ్రు. నాలుగు రోజుల కింద 116 క్వింటాళ్ల వడ్లు అమ్మిన. మూడు రోజుల్లోనే బ్యాంక్ అకౌంట్లో పైసలు పడ్డయి.
– సహదేవుడు, రైతు, అమ్మాపూర్, చిన్నచింతకుంట మండలం3
వడ్ల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా
సెంటర్లకు వస్తున్న వడ్ల వివరాలను ఓపీఎంఎస్ కంప్లీట్చేస్తున్నాం. దీంతో పేమెంట్లు స్పీడ్‌గా అవుతున్నాయి. ఇటీవల 'రైతు పండుగ'లో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో వడ్ల సేకరణపై ఆరా తీశారు. ఉమ్మడి జిల్లాలో సెంటర్లకు ఎక్కువగా సన్నాలు వస్తున్నాయని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు వివరిం చడంతో ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.
– షేక్ ఇర్ఫాన్, డీఎం, సివిల్‌సప్లయ్, మహబూబ్‌నగర్