రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైమ్: మహిళ సమాఖ్య సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫాం చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు ఉచితంగా ఈ యూనిఫాం చీరలు ఇవ్వాలని నిశ్చయించింది. ఈ యూనిఫాం చీరల కోసం ప్రత్యేకంగా డిజైన్లు రూపొందించారు. మహిళా సంఘాల కోసం తయారు చేసిన యూనిఫాం చీరలను సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ గురువారం (డిసెంబర్ 12) మంత్రి సీతక్కకు చూయించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో యూనిఫామ్ చీరల డిజైన్లను ఖరారు చేయనున్నారు. 

ALSO READ | గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ఉంటే చాలు.. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేయచ్చు.. మొదట హైదరాబాద్‌లోనే!

చీరల డిజైన్లు ఫైనలైజ్ చేసిన తర్వాత 63 లక్షల మంది మహిళ సంఘ సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మహిళా సంఘాల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ మహిళాశక్తి' పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద వచ్చే ఐదేళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించున్నారు. గ్రామాల్లోని మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించి వారిని కోటీశ్వర్లును చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసమే ఈ పథకం తీసుకువచ్చింది.