AUS vs IND: గబ్బాలో మూడో టెస్ట్.. టైమింగ్స్ వివరాలు ఇవే

భారత్, ఆస్ట్రేలియా మధ్య శనివారం (డిసెంబర్ 14) మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫేవరేట్ గా కనిపిస్తుంటే.. టీమిండియా జట్టు కాస్త ఒత్తిడిలో కనిపిస్తుంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్ పై క్రికెట్ ప్రేమికులకు ఆసక్తి పెరిగింది. ఇరు జట్లు సిరీస్ లో చెరో మ్యాచ్ గెలిచి 1-1 తో సమంగా ఉన్నాయి.   సిరీస్ లో ఆధిక్యం సాధించాలంటే మూడో టెస్ట్ ఇరు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం టైమింగ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.  

భారత కాలమాన ప్రకారం మ్యాచ్ ఉదయం 5:50 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 7:50 నిమిషాల వరకు ఈ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు 40 నిమిషాల పాటు లంచ్ విరామానికి వెళ్తారు. తిరిగి 8:30 నిమిషాలకు రెండో సెషన్ ప్రారంభమవుతుంది. 10:50 నిమిషాల వరకు ఈ సెషన్ ఉంటుంది. రెండు సెషన్ ల తర్వాత టీ విరామం 20 నిమిషాల పాటు ఉంటుంది. చివరి సెషన్ 10:50 నిమిషాల నుంచి 1:20 నిమిషాల వరకు ఉంటుంది. ఈ మ్యాచ్ చూడడానికి ఇప్పటికే గ్రౌండ్ హౌస్ ఫుల్ అయినట్టు సమాచారం. 

ALSO READ | IND vs AUS: హెడ్ బలహీనత అదే.. భారత బౌలర్లు మేల్కోవాలి: ఛటేశ్వర్ పుజారా

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మొబైల్స్ లో డిస్నీ+ హాట్‌స్టార్ యాప్ లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. వెబ్‌సైట్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇది మూడో మ్యాచ్ కాగా.. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి.