కూతురి జ్ఞాపకాలతో అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లిన తండ్రి 

హైదరాబాద్: కూతురు జ్ఞాపకాలను మర్చిపోలేని ఓ తండ్రి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లి బిడ్డ సమాధి పక్కనే పడుకున్నాడు. ఈ ఘటన నారాయణ పేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని గోపాల్ పేట వీధికి చెందిన లక్ష్మీ ప్రణీత హోలీ వేడుకల్లో ప్రమాదవ శాత్తు మినీ వాటర్ ట్యాంక్ కూలి మృతి చెందింది. అయితే ఆమె మృతదేహానికి అదే రోజు సాయంత్రం పట్టణ శివారులోని శ్మశాన వాటికలో అంత్య క్రియలు నిర్వహించారు.

కార్య క్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి రమేష్ స్నానం చేసిన వెంటనే బయటకు వెళ్లాడు. రాత్రి 11.30 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానం వచ్చి అమ్మాయిని పూడ్చిన స్థలానికి వెళ్లి చూడగా అక్కడే పడుకొని ఉండటంతో కుటుంబసభ్యులు, బంధువులు సముదాయించి ఇంటికి తీసుకొచ్చారు.