ఈపీఎఫ్‌‌ఓ అకౌంట్ హోల్డర్స్‌‌కు కొత్త సదుపాయం

ఈపీఎఫ్‌‌ఓ అకౌంట్ హోల్డర్స్‌‌కు కొత్త సదుపాయం

న్యూఢిల్లీ: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌‌ఓ) తన అకౌంట్ హోల్డర్స్‌‌కు మరింత స్వేచ్ఛను ఇచ్చింది. సొంతంగా అకౌంట్ హోల్డర్సే యునివర్సల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్‌‌)ను ఆన్‌‌లైన్‌‌లో జనరేట్ చేసుకునే కొత్త ఫెసిలిటీని లాంచ్ చేసింది. అంతకుముందు యూఏఎన్‌‌ జనరేట్ చేసుకోవడం కోసం వారి ఎంప్లాయర్‌‌‌‌(కంపెనీ)ని సంపద్రించాల్సి వచ్చేది. ఎంప్లాయీ వద్ద నుంచి అవసరమైన సంతకాలు తీసుకున్న తర్వాత, ఈపీఎఫ్‌‌ఓ ఆఫీసుకు వాటిని కంపెనీ సమర్పించేది. అప్పుడు యూఏఎన్ జనరేట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎంప్లాయీ తాను పనిచేసే కంపెనీ ప్రమేయం లేకుండానే సొంతంగా యూఏఎన్‌‌ను జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్‌‌ను జనరేట్ చేసుకోవడానికి వీలులేదు.  ఒక్కసారి జనరేట్‌‌ చేసుకున్న నెంబరే జీవితకాలం ఉంటుంది. ఉద్యోగం మారుతున్న ప్రతీసారి, కొత్త ఎంప్లాయర్(కంపెనీ)కి మీరు మీ యూఏఎన్‌‌ ను షేర్ చేయాల్సి ఉంటుంది. దీంతో అంతకుముందు ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త అకౌంట్లోకి ఆటోమేటిక్‌‌గా ట్రాన్స్‌‌ఫర్ అవుతుంది.

యూఏఎన్ ఎలా జనరేట్ చేసుకోవాలి…

మెంబర్ సర్వీసెస్‌‌ కోసం ఈపీఎఫ్‌‌ఓ యునిఫైడ్ పోర్టల్‌‌కు వెళ్లాలి. ఈ పేజీలో కింద కుడివైపు ఉండే ‘డైరెక్ట్ యూఏఎన్‌‌ అలాట్‌‌మెంట్‌‌ బై ఎంప్లాయీస్’ అనే ఆప్షన్‌‌ను క్లిక్ చేయాలి. ఇప్పటికే యూఏఎన్‌‌ ఉన్నవారు ‘నో యువర్ యూఏఎన్‌‌ స్టేటస్’పై క్లిక్ చేసి ఈ స్టేటస్‌‌ను కూడా తెలసుకోవచ్చు. ‘డైరెక్ట్ యూఏఎన్‌‌ అలాట్‌‌మెంట్ బై ఎంప్లాయీస్‌‌’ను నొక్కిన వెంటనే, ఒక కొత్త పేజీలోకి వెళ్తోంది. అక్కడ ఆధార్‌‌‌‌తో లింక్ అయి ఉన్న మీ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్‌‌ను ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌‌‌‌తో ఆధార్ కార్డు ఉన్న వారు మాత్రమే ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు. యూఏఎన్‌‌ జనరేట్ అయిన తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్‌‌‌‌కు వచ్చే ఓటీపీ ద్వారా యూజర్ తమ ఐడెంటీని ధృవీకరించుకోవాలి. మీకు వచ్చే పాస్‌‌వర్డ్ ద్వారా ఈపీఎఫ్‌‌ఓ వెబ్‌‌సైట్‌‌లో లాగిన్ అవ్వొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద  సోషల్ సెక్యురిటీ ఆర్గనైజేషన్ అయిన ఈపీఎఫ్‌‌ఓ, 22 కోట్ల అకౌంట్లను నిర్వహిస్తోంది. దీనిలో సుమారు రూ.13 లక్షల కోట్ల ఫండ్ ఉంటుంది.