ప్రాణం ఖరీదు రూ.500.. రంగారెడ్డి జిల్లాలో లేబర్ను చంపిన గుత్తేదారు

డబ్బు ముందు ప్రాణానికి విలువ లేదన్నట్లు ఉంది ప్రస్తుత సమాజంలో పరిస్థితి. డబ్బు కోసం మనిషిని చంపడానికి వెనకాడని పరిస్థితి నెలకొంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ లో సాయి అనే డైలీ లేబర్ డబ్బు ముందు తన ప్రాణం ఎక్కువ కాదన్నట్లు తనువు చాలించాడు. గుత్తేదారు శ్రీనివాస్ కేవలం రూ.500 కారణంగా సాయిని పొట్టనపెట్టుకోవడం కలకలం రేపింది.

పనిచేసిన తన కష్టానికి సంబంధించి రావాల్సిన 500 రూపాయలు ఇవ్వాలని సాయి గుత్తేదారు శ్రీనివాస్ ను అడిగాడు. డబ్బు విషయంలో తాగిన మత్తులో ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇద్దరి 500 రూపాయల విషయంలో గొడవ తలెత్తడంతో శ్రీనివాస్ విచక్షణ మరిచి సాయిపై దాడికి దిగాడు. 

ALSO READ | దౌల్తాబాద్​లో చిరుత సంచారం.. పొలం దగ్గర కట్టేసిన లేగదూడను చంపి తినేసింది

సాయి తన డబ్బు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో ఆవేశానికి లోనైన శ్రీనివాస్ పక్కనే ఉన్న డ్రైనేజ్ మూతతో సాయి తలపై కొట్టాడు. తలపై గాయం బలంగా కావడంతో  తీవ్ర రక్తస్రావం జరిగింది. హాస్పటల్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే  చనిపోయాడు. కేవలం 5 వందల రూపాయల కోసం గొడవ పడి ప్రాణాల వరకు తెచ్చుకున్నారు. ఇద్దట్లో ఎవరు సంయమనం పాటించినా ప్రాణం మిగిలేది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.