ఎయిర్ టెల్ ఎండీ రెమ్యునరేషన్​ పై ప్రత్యేక తీర్మానం

ఎయిర్ టెల్ ఎండీ రెమ్యునరేషన్​ పై ప్రత్యేక తీర్మానం

న్యూఢిల్లీ: ఎయిర్​టెల్​ మేనేజింగ్​ డైరెక్టర్​గా మరో ఐదేళ్లపాటు గోపాల్​ విఠల్​ను కొనసాగించాలన్న ప్రపోజల్​ను కంపెనీ షేర్​హోల్డర్లు ఆమోదించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ నియామకం వర్తిస్తుంది. ఇటీవలి యాన్యువల్​ జనరల్​ మీటింగ్​లో (ఏజీఎం) 97 శాతం మంది షేర్​హోల్డర్లు గోపాల్​కు మద్దతుగా ఓట్లు వేశారు. ఈయనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్​సంబంధించిన ప్రత్యేక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. దీనికి మద్దతుగా 89.57 శాతం ఓట్లు పడ్డాయి. ఈ నెల 12న కంపెనీ ఏజీఎం జరిగింది. ‘‘గోపాల్​ను తిరిగి ఎండీగా కొనసాగించడానికి షేర్​హోల్డర్లు ఒప్పుకున్నారు. ఆయన​ రొటేషన్​ పద్ధతిలో రిటైర్​ కావాల్సి ఉంటుంది. సీఈఓగానూ పనిచేస్తారు.

గోపాల్​ 2018 ఫిబ్రవరి నుంచి కంపెనీ ఎండీ, సీఈఓగా పనిచేస్తున్నారు” అని ఏజీఎం నోటీసు పేర్కొంది. ఈయనకు సంవత్సరానికి రూ.9.6 కోట్ల చొప్పున జీతం ఇవ్వడానికి షేర్​హోల్డర్లు అంగీకరించారు. తదనంతర సంవత్సరాల్లో జీతంలో 15 శాతం వరకు ఇంక్రిమెంటు ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిశాక పెర్ఫార్మెన్స్​ లింక్డ్‌​ ఇన్సెంటివ్​గా రూ.6.2 కోట్ల వరకు ఇస్తారు. ఇది మొత్తం జీతంలో 90 శాతం మించకుండా చూస్తారు. పోయిన ఆర్థిక సంవత్సరంలో గోపాల్​కు రూ.9.1 కోట్ల జీతం ఇచ్చారు.  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ ప్రస్తుత నెలలోనే 5జీ సేవలను ప్రారంభించనుందని,  2024  మార్చి నాటికి భారతదేశంలోని అన్ని పట్టణాలను,  ముఖ్య గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తుందని విఠల్​ పేర్కొన్నారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ 5జీ స్పెక్ట్రమ్ వేలంలో 3.5 గిగాహెజ్,​  26 గిగాహెజ్​ బ్యాండ్లలో 19,867.8 మెగాహెజ్​ ఫ్రీక్వెన్సీలను కొనుగోలు చేసింది.  మొత్తం రూ.43,040 కోట్లతో లో , మిడ్​ -బ్యాండ్ స్పెక్ట్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రేడియోవేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను దక్కించుకుంది. ఫలితంగా దేశమంతటా 5జీ సేవలను అందించగలుగుతుంది.