రైస్​ మిల్​ తనిఖీ

కల్వకుర్తి, వెలుగు : సివిల్  సప్లై టాస్క్​ఫోర్స్  టీమ్​ శనివారం కల్వకుర్తి పట్టణంలోని లక్ష్మీ వెంకట నరసింహ స్వామి పారా బాయిల్డ్  రైస్ మిల్లును తనిఖీ చేశారు. సీఎంఆర్  వడ్లకు సంబంధించిన లెక్కలను చూశారు.

రూ.23.03 కోట్ల విలువైన 2,86,694 బస్తాలు తక్కువగా ఉన్నాయని తేల్చారు. మిల్​ ఓనర్​పై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు డిస్ట్రిక్ట్​ సివిల్  సప్లై ఆఫీసర్​ స్వామి కుమార్ తెలిపారు.