భూమిలాంటి గ్రహం ఇంకోటి ఉందా ? ప్రాజెక్ట్ హైపేరియన్​ అంటే ఇదే..

ప్రకృతి విపత్తులు, పెరుగుతున్న మానవ కార్యకలాపాల కారణంగా పర్యావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటుండటంతో భూగ్రహం సమస్త జీవరాశులకు నివయోగ్యం ఉండటం లేదు. దీంతో భూమి లాంటి మరో గ్రహం కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రాజెక్టు హైపేరియన్​ తెరమీదకు వచ్చింది. 

    అంతరిక్షంలో నిర్మించే నగరాన్నే ప్రాజెక్టు హైపేరియన్​ లేదా ప్రాజెక్ట్​ టైటాన్​గా పిలుస్తున్నారు. భూమి మీద ఓ పట్టణంలో ఉండే అన్ని రకాల సదుపాయాలు, వసతులు నింగిలో ఓ స్పేష్​షిప్​లో ఉండే ఈ నగరంలోనూ ఉంటాయి. కనీసం 250 ఏండ్లపాటు మనుగడ సాగించేలా ఈ నగరాన్ని నిర్మించనున్నట్లు ప్రాజెక్టు హైపేరియన్​ శాస్త్రవేత్తల బృందం పేర్కొన్నది. 

ALSO READ : ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు : ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ టాపిక్

    ప్రకృతి విపత్తులు, ప్రళయం, బయోవార్​, కరోనా తదితర మహమ్మారుల వ్యాప్తి, అణు యుద్ధాలు వంటివి సంభవించినప్పుడు భూమి మీద జీవజాలం అంతరించిపోకుండా ఉండేందుకే ఈ ప్రాజెక్టు ప్రతిపాదించారు. స్పేస్​షిప్​ నడవడానికి ఇంధనం, నగరంలో గాలి, నీటి శుద్ధి, వాతావరణ పరిస్థితులను సమతుల్యం చేయడం, రోదసిలోని రేడియేషన్​ ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యర్థాల నిర్వహణ ఇలా పలు సవాళ్లు ఎదురవుతాయి.