బొగ్గు స్మగ్లింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరాను సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) విచారిస్తోంది. కోల్‌కతాలోని బెనర్జీ ఇంటిలో బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఎనిమిది మంది సభ్యుల సీబీఐ బృందం రుజీరాను ప్రశ్నిస్తున్నారు. ఎంపీ అభిషేక్ మంగళవారం మధ్యాహ్నం రోడ్ షోకి నాయకత్వం వహించేందుకు త్రిపురకు బయలుదేరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బుధవారం ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలతో నిర్వహించే సమావేశానికి వెళ్లారు.
West Bengal | A CBI team reaches the Kolkata residence of Abhishek Banerjee, TMC national general secretary and CM Mamata Banerjee's nephew, to record the statement of his wife Rujira Banerjee, pertaining to the ongoing coal scam. pic.twitter.com/Ec6EiPUmuj
— ANI (@ANI) June 14, 2022
దుర్గాపూర్, అసన్సోల్ బెల్ట్ నుంచి, జార్ఖండ్ నుంచి అక్రమంగా బొగ్గును వెలికితీసినందుకు అనుప్ మజీ, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్, ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల సహకారంతో ఈ సరిహద్దు ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన అక్రమ బొగ్గు అక్రమ రవాణా జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అభిషేక్ బెనర్జీ, అతని కుటుంబ సభ్యులతో లింకులు ఉన్న లీప్స్ అండ్ బౌండ్ ప్రైవేట్ లిమిటెడ్, లీప్స్ అండ్ బౌండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పి అనే రెండు కంపెనీలు రూ. 4.37 కోట్ల నిధులను అందుకున్నాయని ఈ కేసును కూడా విచారిస్తున్న ఈడీ విచారణలో తేలింది. అభిషేక్ బెనర్జీ తండ్రి అమిత్ బెనర్జీ లీప్స్ అండ్ బౌండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరు. అతని భార్య రుజీరా బెనర్జీ అతని తండ్రితో పాటు లీప్ అండ్ బౌండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు.
