36 వేల మంది టీచర్ల నియామకం రద్దు

36 వేల మంది టీచర్ల నియామకం రద్దు

కోల్​కతా : బెంగాల్ టీచర్ రిక్రూట్​మెంట్ స్కామ్ కేసులో కలకత్తా హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 2016లో అపాయింట్ అయిన 36,000 మంది అభ్యర్థుల నియామకాన్ని రద్దు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. 2014లోని టెట్ ప్రకారం ట్రైనింగ్​ తీసుకోని వాళ్లను కూడా అపాయింట్ చేశారని, నియామక ప్రక్రియలో సరైన విధానాన్ని అనుసరించలేదని పేర్కొంది. అందుకే వాళ్లందరి అపాయింట్​మెంట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ శుక్రవారం రాత్రి 17 పేజీల తీర్పును వెలువరించారు. బెంగాల్​లో ఈ స్థాయి అవినీతిని తానెన్నడూ చూడలేదని పేర్కొన్నారు.