ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లి వివాహేతర సంబంధం వల్ల 15 ఏండ్ల బాలుడి ప్రాణాలు పోయాయి. ఈ దారుణ ఘటన నిహాల్ విహార్ ప్రాంతంలో జరిగింది. స్థానికంగా నివసించే మహిళ కొన్నేళ్ల క్రితం తన భర్తను కోల్పోయింది. దాంతో ఆమె తన 15 ఏండ్ల కొడుకుతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో మహిళకు ప్రదీప్ సింగ్ అనే వివాహితునితో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వారిమధ్య అక్రమసంబంధానికి దారితీసింది. దాంతో ఆ మహిళ ప్రదీప్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకోసం భార్యకు విడాకులు ఇవ్వాలని ప్రదీప్‌ను కోరింది. ఈ విషయమై ప్రదీప్ ఇంట్లో గొడవలయ్యాయి. దాంతో ప్రదీప్ తన భార్యకు విడాకులు ఇవ్వకుండా.. ఆమెను ఇలాగే తనతో ఉండమన్నాడు. అందుకు అంగీకరించని మహిళ.. ప్రదీప్‌తో తెగదెంపులు చేసుకుంది.
ఆ తర్వాత మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ.. మూడు నెలల క్రితం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇది నచ్చని ప్రదీప్ ఎలాగైనా ఆమెపై పగతీర్చుకోవాలనుకున్నాడు. తన తమ్ముడు కపిల్ సింగ్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రదీప్ బాలుడిని కిడ్నాప్ చేశాడు. డిసెంబర్ 22న బాలుడి తల్లికి ఫోన్ చేసి.. రూ. 50 లక్షలు ఇస్తేనే బాలుడిని విడిచిపెడతామని హెచ్చరించారు. వెంటనే బాలుడి తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. కాల్ ట్రేసింగ్ ద్వారా ఫోన్ ఫరీదాబాద్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆ అడ్రస్‌కు వెళ్లి చూడగా.. అప్పటికే బాలుడు చనిపోయి ఉన్నాడు. ఘటనాస్థలం నుంచి కపిల్ సింగ్, మరో వ్యక్తి పట్టుబడ్డారు. ప్రదీప్ సింగ్, మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిడ్నాప్ చేసిన కొన్ని గంటల తర్వాత బాలుడిని గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు.
For More News..
అక్రమాస్తుల కేసులో పాక్ మాజీ మంత్రి అరెస్ట్
‘ములాగ్’ మెడల్ సాధించిన ఏకైక క్రికెటర్
న్యూఇయర్ ఆఫర్: అమెజాన్‌లో ‘మెగా శాలరీ డేస్’
