ట్యూషన్ కి వెళ్ళి తిరిగిరాని బాలుడు..

రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో స్కూల్ స్టూడెంట్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. DNR కాలనీలోని మహిధర్ రెడ్డి అనే బాలుడు మీర్ పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ట్యూషన్ కి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే సీసీ కెమెరాల్లో గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.