కార్తీక పౌర్ణమి, సోమవారం  నవంబర్​ 27న పరమశివుడిని ఇలా పూజించండి..

కార్తీక మాసంలోని కార్తీక సోమవారానికి( Kartika Monday ) ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ ఏడాది (2023)  కార్తీక పౌర్ణమి సోమవారం కలిసి రావడం అత్యంత పుణ్యఫలం అని పండితులు చెబుతున్నారు.  నవంబర్ 27వ తేదీన శుక్ల పక్ష పౌర్ణమి తిధి మధ్యాహ్నం రెండు గంటల 46 నిమిషముల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.


పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తిక నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసానికి కార్తిక పూర్ణిమ అనే పేరు వచ్చింది.కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతం ఆచరించాలని,అలాగే చంద్రునికి చాలా ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి( Kartika Purnami ) అని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం త్రిపురాసుర( Tripurasura ) అనే రాక్షసుడిని పరమశివుడు   కార్తీక పౌర్ణమి రోజున  సంహరించాడని చేశాడని, ఈ రోజున (నవంబర్​ 27)  శివారాధన చేయడం. జ్వాలాతోరణం వంటివి దర్శించుకోవడం వల్ల శివుని  అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.ఇలా శివుడికి ఇష్టమైనటువంటి కార్తీకమాసంలో సోమవారం రోజు నవంబర్ 27వ తేదీన కార్తీక పౌర్ణమి మరియు కార్తీక సోమవారం కలిసి రావడం శివారాధన ( Shiva worship )చేయడానికి పుణ్యం కలగడానికి అత్యంత విశేషమైనటువంటి రోజు అని పండితులు చెబుతున్నారు.శివాలయాల్లో స్వామిని దర్శించుకోవడం వలన శివుని  అనుగ్రహంచేత శివసాన్నిధ్యం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు


కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాల్సిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

జ్వాలా తోరణం వంటివి జరపడం, దర్శించుకోవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే ఉపవాసము లేదా నక్తము ఆచరించుట కూడా మంచిదే అని చెబుతున్నారు.దేవాలయంలో లేదా గృహముల నందు తులసి చెట్టు వద్ద ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించడం ఎంతో మంచిది. కేదారేశ్వర వ్రతం వంటి వ్రతాలను కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాలి. 


కార్తీక పౌర్ణమి రోజున తలస్నానం చేసి, తెలుపు దుస్తులను ధరించి శివ పార్వతీదేవీల పటానికి పసుమ కుంకుమపెట్టి తెల్లటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యంగా బూరెలు, గారెలు, అన్ని ఫలాలను సమర్పించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజున శివ అష్టోత్తరము, లింగాష్టకం వంటి పారాయణ, అష్టోత్తరాలను పఠించడం వల్ల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. 

 ఈ రోజున  ( నవంబర్​ 27) పుణ్య నది స్నానాలు చేయాలి.ఈ రోజు శివాలయాలలో నది పరివాహక ప్రాంతాలలో ఇళ్లలో శివరాధన, శివునికి అభిషేకం వంటివి ఆచరించాలి. ఈ రకంగా కార్తీక పౌర్ణమి రోజు భక్తులు ఆచరిస్తే అటువంటి వారికి శివానుగ్రహం వల్ల పుణ్యము, జ్ఞానముల ద్వారా మోక్షము కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 

కార్తీక పౌర్ణమి రోజు మహావిష్ణువు మత్స్యావతారం దాల్బెనని మత్స్యపురాణంలో  తెలిపారు. దత్తాత్రేయుని యొక్క జననం జరిగిన రోజు కార్తీక పౌర్ణమిగా, అలాగే కార్తీకేయుడు జననం జరిగిన రోజు కార్తీక పౌర్ణమిగా చెప్పబడ్డాయి.ఇలా శివుడికి ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో అలాగే శివప్రీతికరమైనటువంటి సోమవారం,   కార్తీక పౌర్టమి మరియు కార్తీక సోమవారం కలసిరావడం శివానుగ్రహం పొందడానికి పుణ్యార్చన కలగడానికి అత్యంత విశేషమైనటువంటి రోజుగా పండితులు చెబుతున్నారు.