లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు వ్యక్తులు స్పాట్ డెడ్

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి షాద్ నగర్‎లోని ఎలికట్ట చౌరస్తా వద్ద ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో బైక్‎పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను పులుసు మామిడి గ్రామానికి  చెందిన శేఖర్, రేగడి చిలకమర్రి చెందిన కరుణాకర్‎గా గుర్తించారు. ఈ మేరకు మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.