ఫైఓవర్ పై నుంచి కిందపడ్డ బైక్.. ఇద్దరు స్పాట్‌డెడ్

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డారు. విశాఖ ఎన్ ఏ డి కొత్తరోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఈ యాక్సిడెండ్ జరిగింది. అతివేగంగా వస్తున్న బైక్ కంట్రోల్ కాకపోవడంతో ఢివైడర్ ను ఢీకొన్ని ముగ్గురు ఫ్లై ఓవర్ నుంచి కింద పడ్డారు.  వారిలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరొ వ్యక్తికి తీవ్రంగా గాయాలైయ్యాయి. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.