ఛార్జింగ్ పెట్టిన క్షణాల్లో ఫోన్ బ్యాటరీ ఫుల్లై పోవాలని అనుకుంటాం. ఇప్పుడు అందరూ అదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఫోన్ ఛార్జింగ్ క్షణాల్లో నిండిపోవాలని ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆ ఫోన్ల వల్ల ప్రమాదాలు సంబవిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాడ్ పవర్ జెడ్ నెట్ సంస్థ ప్రకారం బ్యాడ్‌పవర్ ఫాస్ట్ ఛార్జర్‌ను పాడు చేయడమే కాదు, ఛార్జింగ్ ప్రాసెస్ కోసం వోల్టేజ్‌పై చిప్ ఫర్మ్‌వేర్‌తో పాటు ఛార్జింగ్ పరికరాన్ని అనుసంధానించడంలో విఫలం అవుతున్నట్లు తెలుస్తోంది. అవి ఎంతవరకు సురక్షితం అనేది ప్రశ్నే? ఎక్కువ వోల్టేజ్‌ను ఓవర్‌లోడ్ చేయడం ద్వారా ఫోన్‌లలో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.
అందుకే ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పరికరాలు పేలిపోకుండా నిరోధించేందుకు తయారీదారులు తక్కువ వోల్టేజ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు తోడ్పడే పరికరాలకు అదనపు ఫ్యూజ్‌లను జోడించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
