అధికారులు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో..పేదలకు ఇసుక కష్టాలు

ఉప్పునుంతల, వెలుగు : ఇంటి నిర్మాణాలకు ఇసుక తీసుకెళ్లేందుకు అధికారులు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో పేదలు తిప్పలు పడుతున్నారు. ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన మాడ్గుల పర్వతాలు కుటుంబసభ్యులతో కలిసి ఇలా ఎండలో సిమెంట్  బస్తాల్లో ఇసుకను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి పర్వతాలు ఒక్కడిదే కాదని, పేదలంతా ఇలాగే ఇసుక తీసుకెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని మొలగరా సమీపంలోని దుందుభి నది నుంచి ఇసుకను  ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లేందుకు పర్మిషన్  ఇవ్వకపోవడంతో సిమెంట్​ బస్తాల్లో ఇసుక నింపుకొని ఒడ్డుకు తెచ్చుకుంటున్నారు. ఆ తరువాత ఆటోలో ఇంటికి చేర్చుకుంటున్నారు.

ఇదిలాఉంటే ఇక్కడి నుంచి నిబంధనలు పాటించకుండా లారీల్లో ప్రతి రోజూ ఇసుక తరలిపోతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఇండ్లు కట్టుకునే వారికి పర్మిషన్లు ఇవ్వడంతో పాటు అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.