బండ్లగూడలో దారుణం.. భార్య గొంతుకోసి తగలబెట్టిన భర్త

హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బండ్ల గూడా పోలీస్ స్టేషన్ పరిధిలో హస్మా బాద్ ఖాద్రియా మస్జీద్ సమీపంలో భార్యను గొంతు కోసి హతమార్చాడు భర్త. బండ్ల గూడా ఫైజ్ ఖురేషి(28) ఆటో డ్రైవర్ నడుపుతూ జీవనం సాగిస్తూఉండేవాడు. పిసల్ బండాకి చెందిన ఖమర్ బేగం(24)ని ఆరేళ్ల క్రితం నిఖా( వివాహం) చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

దాంపత్య జీవితంలో చిన్నపాటి గొడవలకే ఖురేషి భర్యను హత్య చేశాడు. సోమవారం (నవంబర్ 11) అర్ధరాత్రి గొడవ కారణంగా భర్త ఫైజ్ ఖురేషి కోప్రోక్ధుడై భార్య ఖమర్ ని గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని మంటల్లో కాల్చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫైజ్ ఖురేషి లొంగిపోయాడు. బండ్లగూడా పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.