కూకట్‌పల్లిలో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై పండ్ల వ్యాపారి రేప్ అటెంప్ట్

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం వెలుగులోకి వచ్చింది.- కూకట్ పల్లి వివేకానంద నగర్ లో ఐదేళ్ల బాలుడిపైన పండ్ల వ్యాపారి లైంగిక దాడికి యత్నించాడు. వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి భవన నిర్మాణ పనుల కోసం ఓ కార్మికుడి కుటుంబం హైదరాబాద్ కు వచ్చి కుకట్ పల్లిలో స్థిరపడింది. కార్మికుడి కొడుకు జంతర్(5)ని పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు వారం రోజులుగా పండ్లు ఇస్తూ పరిచయం పెంచుకున్నాడు. నవంబర్ 19న బాలుడిని బెదిరించి బలవంతంగా పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. వెంటనే బాలుడు కేకలు వేయడంతో.. అప్రమత్తమైన స్థానికులు, కుటుంబ సభ్యులు యువకుడికి దేహశుద్ధి చేశారు. యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.