విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధంలేదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్ సభలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదన్నారు నిర్మల. స్టీల్ ప్లాంట్ నుంచి వందశాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రొడక్షన్ మెరుగుపరిచేందుకే విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేస్తున్నట్లు నిర్మల తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు నిర్మల.
