దురద పెట్టినప్పుడు గోకితే హాయిగా ఉంటుంది. కానీ అదెంత హాయిగా ఉంటుందో మీరు ఎప్పుడైనా కొలిచారా? ఎలా కొలువగలం? అంటారా! కానీ.. అలా కొలిచినందుకే ఓ వ్యక్తికి ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ దక్కింది! ఇలాంటి రీసెర్చ్ లకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడమేంటీ? అనుకుంటున్నారా? ఇవి అసలైన నోబెల్ ప్రైజ్‌లు కావు. నోబెల్ లాంటివి.. కానీ, నోబెల్ కావు. ఇగ్ నోబెల్ ప్రైజ్‌లు! అంటే.. నవ్వు తెప్పించే రీసెర్చ్‌లకు ఇచ్చేవన్నమాట! ఈ ఏడాది 29వ ఇగ్ నోబెల్ ప్రైజ్‌లను మొత్తం10 కేటగిరీల్లో విజేతలకు మంగళవారం ప్రదానం చేశారు.
2019 ఇగ్ నోబెల్ విజేతలు వీరే..
మెడిసిన్: ఇటలీలో తయారైన పిజ్జాలు తినేవారికి రోగాల నుంచి రక్షణ లభించి ఆయుష్షు పెరుగుతుందని తేల్చిన సిల్వనో గాలస్‌కు.
మెడికల్ ఎడ్యుకేషన్: జంతువులకు ఆపరేషన్ చేసేటప్పుడు వాటి దృష్టి మళ్లించేందుకు క్లికర్ ట్రెయినింగ్ అనే టెక్నిక్ వాడతారు. మనుషులకు ఎముకల సర్జరీలో దాన్ని వాడొచ్చని నిరూపించిన కరేన్ ప్రైయర్, థెరెసా మెకియాన్ కు ఇచ్చారు.
బయాలజీ: అయస్కాంత శక్తితో ప్రభావితం చేస్తే.. చనిపోయిన బొద్దింకలు, బతికి ఉన్న బొద్దింకల్లో కదలికలు వేర్వేరుగా ఉంటాయని తేల్చినందుకు లింగ్ జన్ కాంగ్, హెర్బర్ట్ క్రెపాజ్, మరో నలుగురికి.
అనాటమీ: లోదుస్తులు వేసుకున్న, వేసుకోని పురుషుల గజ్జల్లో వేడిని కొలిచినందుకు రోజర్ మీసెట్, బౌరాస్ బెనగౌడిఫాకు.
కెమిస్ట్రీ: ఐదేండ్ల పిల్లల్లో రోజూ ఎంత లాలాజలం ఊరుతుందో కొలిచినందుకు షీగెరు వటనాబే, మీనెకో ఒహినిషి, మరో ముగ్గురికి.
ఇంజనీరింగ్: చిన్నపిల్లలకు డైపర్లను మార్చే మెషీన్ కనుగొన్నందుకు ఇమాన్ ఫరాబక్స్కు
ఎకానమిక్స్: డేంజరస్ బ్యాక్టీరియాలను రవాణా చేయడంలో ఏ దేశం కాగితపు కరెన్సీ బెస్ట్ అని తేల్చిన హబిప్ గెడిక్, తిమోతీ, ఆండ్రియాస్ లకు ఇచ్చారు.
పీస్: దురద పెట్టినప్పుడు గోకితే ఎంత హాయిగా ఉంటుందో కొలిచినందుకు
వాజ్ పేయికీ ఇగ్‌నోబెల్!
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ నవాజ్ షరీఫ్‌లకు 1998లో ఇగ్ నోబెల్ పీస్ ప్రైజ్‌ను సంయుక్తంగా ప్రకటించారు. ‘‘అటామిక్ బాంబులను పరీక్షించడం (పేల్చడం) ద్వారా చాలా తీవ్రంగా శాంతి చర్చలు చేసినందుకు” వారికి ఈ అవార్డు ప్రకటించారు.
ఇగ్ నోబెల్ విజేత.. నోబెల్ విన్నర్ కూడా!
సర్ ఆండ్రీ జీమ్ అనే సైంటిస్ట్ 2000లో ఫిజిక్స్‌లో ఇగ్‌నోబెల్ గెలుచుకున్నారు. అయస్కాంత శక్తిని ఉపయోగించి, కప్పలను గాలిలో పైకి లేపినందుకు ఆయన ఈ అవార్డు పొందారు. అయితే, గ్రాఫీన్ పై చేసిన పరిశోధనలకు 2010లో ఒరిజినల్ నోబెల్ కూడా వచ్చింది ఆయనకు.
ఇగ్ నోబెల్ అంటే.. నవ్వు తెప్పించేది
ఈ అవార్డులను అమెరికాకు చెందిన అన్నాల్స్ ఆఫ్ ఇంప్రాబబుల్ రీసెర్చ్ అనే మ్యాగజైన్ ఎడిటర్ మార్క్ అబ్రహామ్స్ 1991లో ప్రారంభించారు. ఇగ్‌నోబెల్ అంటే నవ్వు తెప్పించేది అని అర్థం. ఇందులో నోబెల్అన్న పదం కూడా కలిసి వస్తుంది కాబట్టి.. ఇగ్నోబెల్అంటూ దీనికి పేరు పెట్టారు. అవార్డుల వేడుక కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అసలైన నోబెల్‌ప్రైజ్ గెలుచుకున్న సైంటిస్టులు, ప్రముఖుల చేతుల మీదుగానే ఈ అవార్డులు అందిస్తారు.ఘాదా ఎ బిన్ సైఫ్, అలెక్సాండ్రు పాపియూ, మరో ఐదుగురు ఈ అవార్డు గెలుచుకున్నారు.
