ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్ బీవై)ల కింద చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం నేటి ( జూన్ 1) నుంచి పెరగనుంది. ఈ రెండు పథకాలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకుని జీవనజ్యోతి బీమా యోజన ప్రీమియంను రూ.330 నుంచి రూ.436కు, సురక్ష యోజన ప్రీమియంను రూ.12 నుంచి రూ.20కి పెంచారు. ఈ రెండు పథకాలను ఆర్థికంగా లాభదాయకంగా మార్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది.
2015లో ఈ రెండు పథకాలను ప్రారంభించి చెల్లింపులను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఏడేళ్లపాటు ఏటా నష్టాలు వస్తున్నప్పటికీ ప్రీమియంను మాత్రం పెంచలేదని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఇప్పుడు ప్రీమియంను పెంచడం ద్వారా ఈ పథకాల అమలుకు ప్రైవేటు కంపెనీలనూ ఆహ్వానించడానికి వీలవుతుందని తెలిపింది.
మరిన్ని వార్తల కోసం..
