Best Actors of 21st Century: ఈ 21వ శతాబ్దంలో ఇండియాలో ఉన్న బెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా?

ఇండియన్ సినిమా చరిత్రలో ఎవ‌రికీ ద‌క్కని అరుదైన గౌరవం దివంగ‌త న‌టుడు ఇర్ఫాన్ ఖాన్కి (Irrfan Khan) ద‌క్కింది. ఈ 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ యాక్టర్స్ జాబితాలో ఇర్ఫాన్ చోటు సంపాదించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. 

హాలీవుడ్ ప్ర‌ఖ్యాత మ్య‌గ‌జైన్ 'ది ఇండిపెండెంట్'(The Independent) లేటెస్ట్గా రిలీజ్ చేసిన బెస్ట్ 60 యాక్టర్స్ లిస్టులో ఒకే ఒక్క ఇండియన్ హీరో చోటు సంపాదించుకున్నాడు. 2000 ఏడాది తర్వాత రిలీజైన సినిమాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితా తయారు చేసింది. ఇందులో వరల్డ్ వైడ్గా ఉన్న నటులలో అరుదైన ప్రతిభను గుర్తించి లిస్ట్ రిలీజ్ చేశారు. అందులో ఇండియా నుంచి ఉన్నది ఒక్కరు మాత్రమే. అతనే బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్. అతనికి ఈ ప్ర‌ఖ్యాత మ్య‌గ‌జైన్ లో 41వ స్థానం దక్కింది.

అయితే, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 21 వ శతాబ్దం మొదలై ఇప్పటికీ 24 సంవత్సరాలు అయింది. ఈ మధ్య కాలంలో (21వ శతాబ్దం) షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి వంటి స్టార్స్ తమదైన నటనతో పీక్స్ స్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ నటుడు ఇర్ఫాన్ మాత్రమే చోటు దక్కించుకోవడం విశేషమని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇర్పాన్ ఖాన్ న‌ట‌ చాతుర్యం,తనలోని వైవిధ్యత, విల‌క్ష‌ణ‌త‌ అతడికి ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కేలా చేశాయని చెప్పవచ్చు. ఇకపోతే 2020లో కన్నుమూసిన ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి దశాబ్దానికి పైగా కష్టపడ్డాడు. ఆ తర్వాత ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు సినీ ప్రేక్షకుల మనసులనూ గెల్చకున్నాడు.

అకాడమీ అవార్డుకు నామినేట్ అయిన సలాం బాంబే (1988), మక్బూల్ (2004), లైఫ్​ ఇన్ ఏ మెట్రో (2007), పాన్ సింగ్ తోమర్ (2011), ది లంచ్ బాక్స్ (2013), హైదర్ (2014), గుండే (2014), పీకూ (2015), తల్వార్ (2015), హిందీ మీడియం (2017) సినిమాల్లో తనదైన నటనతో ఇర్ఫాన్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాడు.

ALSO READ : 2024 టాలీవుడ్ రివ్యూ.. హిట్టు..ఫట్టు..వివాహాలు..వివాదాలు

సైనికుడు (2006) ఫిల్మ్లో నటించి తెలుగు ఆడియన్స్ మెప్పునూ పొందాడు. స్లమ్ డాగ్ మిలియనీర్, జురాసిక్ వరల్డ్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, లైఫ్ ఆఫ్​పై లాంటి ఇంటర్నేషనల్ చిత్రాల్లోనూ మెరిశాడు. 2011లో ఇండియా గవర్నమెంట్ నుంచి ఇర్ఫాన్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. 

21వ శతాబ్దపు టాప్ 10 యాక్టర్స్ వీళ్లే:

ఈ జాబితాలో మరో నటుడికి మరణించిన అనంతరం చోటు దక్కింది. అంతేకాదు. అంతేకాదు అతడే మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. అతనే అమెరికన్ నటుడు ఫిలిప్ సేమౌర్ హాఫ్‌మాన్. 46 ఏళ్ల వయసులో(ఫిబ్రవరి 2, 2014, న్యూయార్క్) మరణించాడు. 

1.ఫిలిప్ సేమౌర్ హాఫ్మన్

2: ఎమ్మా స్టోన్

3. డేనియల్ డే-లూయిస్

4.డెంజెల్ వాషింగ్టన్

5. నికోల్ కిడ్మాన్

6. డేనియల్ కలుయుయా

7. సాంగ్ కాంగ్ హో

8. కేట్ బ్లాంచెట్

9. కోలిన్ ఫారెల్

10. ఫ్లోరెన్స్ పగ్