అమీర్ కోసం ఆదిపురుష్ వాయిదా
అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’కు సంబంధించిన అప్డేట్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. అందులో ఆదిపురుష్ టీమ్కు కృతజ్ఞతలు తెలిపాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమాలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ‘ లాల్ సింగ్ చద్దాను ఏప్రిల్ 14న విడుదల చేస్తామని గతంలో ప్రకటించాం. అయితే షూటింగ్ జాప్యం వల్ల విడుదల తేదీని వాయిదా వేస్తున్నాం. 2022 ఆగస్టు 22న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. మా మూవీ కోసం ఆదిపురుష్ ను వాయిదా వేసుకున్న ఆ చిత్ర నిర్మాత టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్ , టీమ్ మెంబర్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగా ఆదిపురుష్ లో బాహుబలి ఫేం ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ తదితరులు యాక్ట్ చేస్తున్నారు.
