లింగంపల్లి నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి పుష్పక్ బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు మరియు రవాణా సంస్థ (TGSRTC) లింగంపల్లి నుండి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి పుష్పక్ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. ఆదివారం (డిసెంబర్ 15) నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 

లింగంపల్లి నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి పుష్పక్ బస్సు సేవలు ఉదయం 5:45 గంటలకు ప్రారంభమైతే, చివరి బస్సు రాత్రి 8:45 గంటలకు బయలుదేరుతుంది. అదే సమయంలో విమానాశ్రయం నుండి మొదటి బస్సు ఉదయం 7:30 గంటలకు, చివరి సర్వీస్ రాత్రి 10:30 గంటలకు బయలుదేరుతుంది. బస్సులు ఆల్విన్ ఎక్స్ రోడ్, హఫీజ్‌పేట్, కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాల మీదుగా నడుస్తాయి. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి వినోద్ కుమార్ తెలిపారు. 

లింగంపల్లి to హైదరాబాద్ విమానాశ్రయం

  • మొదటి బస్సు ఉదయం 5:45 గంటలకు
  • ఉదయం 6:35 గంటలకు
  • ఉదయం7:25 గంటలకు
  • ఉదయం8:15 గంటలకు
  • ఉదయం9:05 గంటలకు
  • ఉదయం9:55 గంటలకు
  • ఉదయం10:45 గంటలకు
  • ఉదయం 11:35 గంటలకు
  • మధ్యాహ్నం 2:55 గంటలకు
  • మధ్యాహ్నం 3:45 గంటలకు
  • సాయంత్రం 4:35 గంటలకు
  • సాయంత్రం 5:25 గంటలకు
  • సాయంత్రం 6:15 గంటలకు
  • రాత్రి 7:05 గంటలకు
  • రాత్రి 7:55 గంటలకు
  • రాత్రి 8:45 గంటలకు
  • చివరి బస్సు రాత్రి 8:45 గంటలకు

హైదరాబాద్ విమానాశ్రయం to లింగంపల్లి

  • మొదటి బస్సు ఉదయం 7:30 గంటలకు
  • ఉదయం 8:20 గంటలకు
  • ఉదయం 9:10 గంటలకు
  • ఉదయం 10:00 గంటలకు
  • ఉదయం 10:50 గంటలకు
  • ఉదయం 11:40 గంటలకు
  • మధ్యాహ్నం 12:30 గంటలకు
  • మధ్యాహ్నం 1:20 గంటలకు
  • సాయంత్రం 4:40 గంటలకు
  • సాయంత్రం 5:30 గంటలకు
  • సాయంత్రం 6:20 గంటలకు
  • రాత్రి 7:10 గంటలకు
  • రాత్రి 8:00 గంటలకు
  • రాత్రి 8:50 గంటలకు
  • రాత్రి 9:40 గంటలకు
  • చివరి బస్సు రాత్రి 10:30 గంటలకు