కొత్త బస్​పాస్​లు తీసుకోండి..జర్నలిస్టులకు టీజీఎస్ ఆర్టీసీ సూచన

హైదరాబాద్​సిటీ, వెలుగు: జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్‌ కార్డు, పాత బస్‌పాస్‌ చూపించి కొత్త బస్‌ పాస్‌లను తీసుకోవాలని టీజీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో పేర్కొంది . తెలంగాణ సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని అక్రిడేటెడ్‌ జర్నలిస్టుల రాయితీ బస్‌ పాసుల గడువును మరో మూడు నెలలు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం పొడిగించింది. గతంలో మాదిరిగానే సమీపంలోని బస్‌ పాస్‌ సెంటర్లకు జర్నలిస్టులు వెళ్లి పాస్‌లను తీసుకోవాలని సూచించింది.