TGSRTC గుడ్ న్యూస్..హైదరాబాద్ -విజయవాడ బస్సుల్లో 10శాతం డిస్కౌంట్

హైదరాబాద్: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకోసం ప్రత్యేక ఆఫర్లను ఇచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే  ప్ర యాణికులు టికెట్ ధరలపై స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది.. ఈ విషయాన్ని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం (సెప్టెంబర్ 4) న X ద్వారా తెలిపారు. 

హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది టీజీఎస్ ఆర్టీసీ. ఆరూట్ లో రాకపోకలు సాగించే వారికోసం టికెట్ ధరలో 10శాతం డిస్కౌంట్ ను కల్పిస్తోంది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని4 ప్రయాణికులు వినియోగించుకోవాలని టీజీ ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం X ద్వారా తెలిపారు. 

ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలన్నారు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు. ముందస్తు రిజర్వేషన్ కోసం https://www.tgsrtcbus.in ని సంప్ర దించాలని కోరారు.