గ్రూప్ 3 ‘కీ’ విడుదల చేసిన TGPSC.. గ్రూప్ 2 కీ ఎప్పుడంటే..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) గ్రూప్స్ పరీక్షల రిక్రూట్మెంట్​ వేగం పెంచింది. ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-3 'కీ' తాజాగా  విడుదల చేసింది.   మరో రెండ్రోజుల్లో గ్రూప్‌-2 'కీ' విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. 

గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవు అని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా టీజీపీఎస్సీ చైర్మన్  తెలిపారు. ఈ క్రమంలో షెడ్యూల్‌ ప్రకారం ఫలితాలు వచ్చేలా పనిచేస్తున్నామని, అభ్యర్థులెవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

 గ్రూప్ 3 ‘కీ’ టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌  https://www.tspsc.gov.in/   లో చూడగలరు.

 

అంతకుముందు మీడియా సమావేశంలో మాట్లాడిన చైర్మన్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లపై  కీలక వ్యాఖ్యలు చేశారు. టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల నోటిఫికేషన్లు 2025 ఏప్రిల్ తర్వాతనే జారీ చేస్తామని స్పష్టం చేశారు. 2025, మార్చి 31లోపు పెండింగ్‎లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చేస్తామని తెలిపారు. ఏ పరీక్ష ఫలితాలు కంప్లీట్ అయితే అవి వెంటనే ఇచ్చేస్తామన్నారు. గతంలో మాదిరిగా రిజల్ట్ విడుదలలో జాప్యం చేయకుండా త్వరగా ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నామని పేర్కొన్నారు. వచ్చే వారం పదిరోజుల తేడాతో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. 

ALSO READ | ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు.. అతి త్వరలో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు: బుర్రా వెంకటేశం