టీజీఓఎస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్

  • కొత్త కార్యవర్గాన్ని  ప్రకటించిన టీజీవో వైస్ ప్రెసిడెంట్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (టీజీఓఎస్) ఫోరం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా శ్రీనివాస్, ప్రభాకర్ ఎన్నికయ్యారు. మంగళవారం నాంపల్లిలోని టీజీవో భవన్​లో నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి, టీజీవో వైస్ ప్రెసిడెంట్ మాచర్ల రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. 

టీజీఓఎస్ అధ్యక్షుడిగా శ్రీధర్ రావు, కోశాధికారిగా మహమ్మద్​ ఇషాక్​, ఉపాధ్యక్షుడిగా అరుణ్, సహ కార్యదర్శులుగా సీహెచ్​ శ్రీనివాసులు, మీనా కుమారి, కార్యనిర్వాహక కార్యదర్శిగా బి. రామకృష్ణ, ప్రచార కార్యదర్శిగా అంబేద్కర్, కార్యవర్గసభ్యులుగా శ్రీనివాస్​రెడ్డి, గంగామణి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అభినందించారు.