సమైక్యాంధ్ర ఉద్యమం చేసింది నేనే.. టీజీ కనిపించకూడదనే టీఎస్ పెట్టారు :టీజీ వెంకటేశ్

సీఎం సీటు కోసమే రాష్ట్రాన్ని విభజించారని..లేకపోతే కలిసే ఉండేదని బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్. సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేసింది  తానేననని చెప్పారు. టీజీ అంటే కనిపించకుండా ఉండాలనే టీఎస్ గా పెట్టారని తెలిపారు.  పేర్లు మార్చడం మంచి పద్దతి కాదన్నారు.  పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి  సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలన్న తెలంగాణ  కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు..  భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరు మార్చడం కరెక్ట్ కాదన్నారు.  సురవరం ప్రతాపర్ రెడ్డి పేరును మార్చాలనుకుంటే వేరే సంస్థకు పెట్టుకోవాలన్నారు. కేసీఆర్ కుమారుడు పేరు మార్చుతారా అని బీజేపీ లీడర్ టీజీ వెంకటేశ్ ప్రశ్నించారు. 

తిరుమల లడ్డూల్లో కల్తీ జరిగిందనేది తేటతెల్లమైందన్నారు టీజీ వెంకటేశ్.   అవకతవకలు జరిగాయని కొన్ని సంవత్సరాలుగా వింటున్నాము.. దాన్ని పరిష్కరించేందుకు జగన్ చొరవ చూపలేదన్నారు. భూమణ కరుణాకర్ రెడ్డి నాస్తకికుడని ..  వైవీ సుబ్బారెడ్డి భార్య అన్యమతస్తురాలనే అభియోగాలు ఉన్నా ఎందుకు టీటీడీ ఛైర్మన్ గా నియమించారని ప్రశ్నించారు. జగన్ ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం లేదన్నారు.  కోట్లు ఖర్చు పెట్టి తిరుమల సెట్టింగ్ వేసుకున్న జగన్ కు సంతకం పెడితే ఏమైందని ప్రశ్నించారు.